
మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కల్యాణ లక్ష్మీతో బాల్యవివాహాలు తగ్గాయన్నారు. హైదరాబాద్ రాణిగంజ్ బుద్దావన్ లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆఫీసుని హరీశ్ రావు ప్రారంభించారు. ఒంటరి మహిళకు ఆసరా పెన్షన్ 2వేల రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.