వింత ఆచారం..గ్రహణం రోజున పిల్లలను మెడ వరకు నేలలో పూడ్చారు

వింత ఆచారం..గ్రహణం రోజున పిల్లలను మెడ వరకు నేలలో పూడ్చారు

దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం పూర్తయింది. అయితే కొందరు మూఢ నమ్మకాల పేరుతో  రెచ్చిపోయారు. వింత ఆచరాలతో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారు. సూర్యగ్రహణ సమయంలో పిల్లలను మెడ వరకు నేలలో పూడ్చిన ఘటన కర్ణాటకలో కలవరం రేపుతోంది.

కర్ణాటకలోని కలబురాగి నగర శివార్లలోని తాజ్‌సుల్తాన్‌పూర్ గ్రామంలో సూర్యగ్రహణం సమయంలో (8.00 AM. నుండి 11.05 AM వరకు) ముగ్గురు పిల్లలు సంజన (4), పూజ క్యమలింగ (6)  కావేరి (11) మెడ వరకు  నేలలో పూడ్చారు. గ్రహణం సమయంలో అంగవైకల్యంతో ఉన్న పిల్లలను నేలలో పూడ్చితే  అంగవైకల్యం పోతుందనేది వారి నమ్మకమంట. పిల్లలు ఏడుస్తున్నా బయటకు తీయకుండా గ్రహణం అయిపోయే వరకు నేలలోనే ఉంచారు. వారి తల్లిదండ్రులు. అయితే జనవిజ్ఙాన వేదిక సభ్యులు ఇదేేేమి ఆచారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేలలో పూడ్చితే అంగవైకల్యం ఎలా పోతుందని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  కలబురగి డిప్యూటీ కమిషనర్ బి. శరత్‌ తహశీల్దార్‌ను అక్కడికి పంపించి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చిన్నారులను రక్షించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.