
సెల్ పిచ్చి పిల్లల్లో పీక్స్ కు చేరింది. ఏడాది, రెండేళ్లకే చేతుల్లోకి మొబైల్ చేరడంతో మానసిక సమస్యలు పెరిగాయి. కొందరు పిల్లలు సైకోల్లా మారుతున్నారు. మందలిస్తే ఇంటి నుంచి పరారవుతున్నారు.ఫోన్ లాక్కుంటే హత్యలు చేస్తున్నారు. మొబైల్ కొనివ్వకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజర్ల దాకా ఇదే పరిస్థితి. డాక్టర్లు మాత్రం 8 ఏళ్లలోపే ఎడిక్షన్ ను మాన్పించాలంటున్నారు.
నేటి స్టార్మ్ యుగంలో ప్రతిది ఫోన్ పైనా ఆధారపడాల్సిన పరిస్థితి. మొబైల్ లేకపోతే నిమిషం గడవని సిచ్చువేషన్, దీంతో సెల్ పిచ్చి ఫీక్స్ చేరుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఏజ్ ను అది డ్యామేజ్ చేస్తోంది. ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. గంటల కొద్ది మొబైల్ లో వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం వల్ల పిల్లల బ్రెయిన్ ,కళ్లు,మెడ నరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.మానసిక రోగాలు వస్తున్నాయి. పిల్లల చేతిలో నుంచి మొబైల్ తీసుకుంటే చిత్ర,విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.నలుగురిలో కలవలేక ఆత్మన్యూనతకు లోనవడంతోపాటు తమలో తామే మాట్లాడుకుంటూ మానసిక రోగాలకు గురవుతున్నారు.
మొబైల్ అడిక్ట్ అవుతున్న పిల్లల్లో బెదిరించడం,తమను తామే గాయపర్చుకోవడం,ఏంచేస్తున్నామో తెలియకుండా వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫిజికల్ హెల్త్ పైనా తీవ్ర ప్రభావం మొబైల్ కు అడిక్ట్ అవడంతో పిల్లల ఫిజికల్ హెల్త్ పైనా ఎఫెక్ట్ పడుతోంది.
పిల్లలకు మొబైల్ చూపిస్తూ ఫుడ్ తినిపిస్తున్నారు పేరేంట్స్.దీంతో మొబైల్ ధ్యాసలో ఎంత తింటున్నామన్న దానిపైనియంత్రణ ఉండదు. దీనివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతోంది.సెల్ ఫోన్ లోనే గేమ్స్ ఆడుతూ ఫిజికల్ యాక్టివిటీస్ కు దూరమవుతున్నారు.దీంతో చిన్న వయసులోనే ఒబెసిటీ,బీపీ సమస్యల బారినపడుతున్నారని సైకియాట్రిస్ట్ చెబుతున్నారు.
పిల్లల్లో సైకలాజికల్ సమస్యలకు పేరెంట్సే కారణమంటున్నారు డాక్టర్స్. తమను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మొబైల్ ఇస్తున్నారని. అదే అలవాటుగా, అడిక్షన్ గా మారుతోందని చెబుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఒబెసిటీ,ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు.
పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ గడపాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. బయటకు తీసుకెళ్లి వేరే పనిలో వాళ్లను ఎంగేజ్ చేయాలని చెబుతున్నారు.గ్రాండ్ పేరెంట్స్ తో పిల్లలు టైమ్ స్పెండ్ చేసేలా చూడాలని, ఆటలు ఆడించాలని సూచిస్తున్నారు. పిల్లలకు 8 ఏళ్ల లోపు ఫోన్ అలవాటు మానిపించకపోతే, ఆ తర్వాత మానడం చాలా కష్టమని చెబుతున్నారు. సో పేరేంట్స్ బీ కేర్ ఫుల్ . మీ పిల్లల్ని ఫోన్ నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలస్సిన బాధ్యత మీదే.