
షాకింగ్ న్యూస్..రాజస్థాన్లో ఓ మిషనరీ స్కూల్ నుంచి 8 మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది..దిగ్భ్రాంతి చెందిన వారి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ఎందుకు మావాళ్లను సస్పెండ్ చేశారు అని అడిగితే వారు చెప్పిన సమాధానం అందరిని షాక్ కు గురి చేసింది. విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేయాలని యాజమాన్యాన్ని తల్లిదండ్రులు కోరినా..ఏమాత్రం స్పందించకపోవడం గమనించాల్సి విషయం. ఇంతకీ ఆ 8 మంది విద్యార్థులు చేసిన తప్పేంటీ.. వాళ్లు స్కూల్ నుంచి సస్పెండ్ చేసేందుకు పెద్ద తప్పు ఏం చేశారు.. వారు చేసింది. కేవలం ఆ స్కూల్ లో భారత్ మాతాకీ జై అని నినాదం చేయడమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని బరన్ లో ఇమ్మానియేల్ మిషన్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారని.. 8 మంది విద్యార్థులను స్కూల్ యాజమన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లి బతిమలాడినా తిరిగి స్కూళ్లోకి తీసుకునేందుకు ఓప్పుకోలేదు.
ఇమ్మానియేల్ మిషన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను సస్పెండ్ చేయడం పెద్ద చర్చనీయంశమైంది. రాజస్థాన్లో బీజేపీకి ఇది పెద్ద సవాల్ గా మారింది. మరోవైపు విద్యార్థుల్లో జాతీయత పెంపొందించాల్సిన స్కూళ్లలో.. భారత్ మాతాకీ జై అన్నందుకు సస్పెండ్ చేయడం ఏంటని .. నెటిజన్లు మండిపడుతున్నారు.