వీగన్ డైట్ ఓకేనా.?

వీగన్ డైట్ ఓకేనా.?

వీగన్‌ డైట్‌ అంటే తెలుసు కదా? ఆకులు, పండ్లు, పప్పులు, కూరగాయలు అంతే. గివే తినాలె. మాంసం ముట్టొద్దు .అంతేకాదు.. జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, నూనె లాంటి ఏ పదార్థాలూ ఈ డైట్‌లో ఉండవు. అయితే, బెల్జియం దేశంల తమ పిల్లలకు బలవంతంగా వీగన్‌ డైట్‌ అలవాటు చేస్తున్న తల్లిదండ్రులను జైలుకు పంపాలని నాలుగు రోజుల కింద‘రాయల్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ బెల్జియం’ ఆ దేశ ప్రభుత్వానికి సూచించింది. అసలేమైంది?

‘పిల్లలను బలవంతంగా వీగన్ లుగామార్చడం అనైతికం. ఎందుకంటే పిల్లలు ఎదిగే క్రమంలో ఇది అనారోగ్య సమస్యలకుదారి తీస్తుంది . జంతు సంబంధం లేని డైట్ ని ఎక్కడా నిషేధించలేదు. అది అనారోగ్యమని నిరూపించనూ లేదు. అయినా, వీగన్‌ డైట్ ని బలవంతగా వాళ్లపై రుద్దుతున్నరంటే ఇది పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. వీగన్‌ డైట్‌ ఫాలో అవుతున్న పిల్లలు చాలా మందిఅనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నరు’ అని అకాడమీ అంటున్నది .పిల్లలకు వీగన్‌ డైట్‌ మంచిదని ఏ డాక్టరూచెప్పలేదు. వాళ్లకు వాళ్లే వీగన్ డైట్‌ అలవాటు చేస్తున్నరు. చేసినా కూడా వీగన్‌ డైట్‌ ఫాలో అయ్యే పిల్లలకు క్రమం తప్పకుం డారక్తపరీక్షలు చేయించాలి. విటమిన్ సప్లిమెంట్స్ అందించాలి. వాటిని తల్లిదండ్రులుపట్టించుకోవడం లేదని అకాడమీ డాక్టర్లుప్రభుత్వం దృష్టికి తీస్కపోయినరు.

ఎందుకిలా?

ఈ మధ్య బెల్జియం స్కూల్స్‌, నర్సరీలు,ఆస్పత్రుల్లో చిన్న పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నరు. ఈ మరణాలకు వీగన్‌ డైట్ కి సంబంధముందని వాళ్లు అంటున్నరు. వీగన్‌ డైట్ ను బలవంతంగా అమలు చేస్తున్న పిల్లలపై వెంటనే శిక్ష విధించేలా చట్టాలను రూపొందించాలని చెప్పింది . పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని అకాడమీ అంటున్నది. అకాడమీ సూచన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక అని పిడియాట్రిక్స్‌  చెప్తున్నరు.

ఎవరి వాదన వాళ్లదే‘

‘బాల్యంలో శరీరం మెదడు కణాలను తయారు చేసుకుంటుంది . దీనికి ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరమైతయ్‌. అయితే, మన శరీరంవీటిని సొంతంగా తయారు చేసుకోలేదు.జంతువుల నుంచి లభించే ప్రొటీన్లు అందితేనే ఇది సాధ్యం . బాల్యంలో శరీరానికి జంతు సంబంధిత పదార్థాలు అందించకుంటే మానసిక పరివర్తన ఉండదు. పోషకాహార లోపం వస్తుంది . దీంతో వాళ్ల జీవన ప్రమాణం తగ్గుతది’ అని అకాడమీ రాసుకొచ్చింది . ఈ వీగన్ డైట్ పై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.అమెరికన్‌ అకాడమీ ఆప్ పిడియాట్రిక్స్‌  వీగన్డైట్ ని వ్యతిరేకించడం లేదు. ‘పిల్లలకు వీగన్‌ డైట్ ని అలవాటు చెయ్యడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే, వీగన్ లోనూ అన్ని రకాల పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసకోవాలి’అని అమెరికన్‌ అకాడమీ అంటోంది . కానీ,వీగన్ లో అన్ని పోషకాలు అందించడమంటే ఖర్చుతో కూడుకున్న పని.

పేటా ఫైర్‌‌

ఈ విషయంపై పీపుల్‌ ఫర్‌ ఎథికల్ట్రీట్ మెంట్‌ ఆఫ్ యానిమల్స్‌ (పెటా)బెల్జియం అకాడమీపై ఫైర్‌ అయింది .వెంటనే తన వాదనను కూడా బెల్జియం ప్రభుత్వ దృష్టికి తీస్కపోయింది .‘ ఇదిఅజ్ఞా నంతో కూడిన అభిప్రాయం’ అని యూకేపేటా డైరెక్టర్‌ డాన్‌ కార్‌ మండిపడింది .‘జంతు సంబంధమైన ఆహారమే నిజమైన ప్రమాదకారి. మాంసా హారమే ఆర్థరైటిస్‌,గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కి ప్రధాన కారణం.వెల్‌ ప్లాన్డ్‌ వీగన్‌ డైట్ పసి పిల్లలకు చాలామంచిది’ అని ఆమె చెప్పుకొచ్చింది