వీడియో : డ్రైనేజ్ స్లాబ్ మధ్యలో ఇరుక్కుపోయిన చిన్నారి కాలు

వీడియో : డ్రైనేజ్ స్లాబ్ మధ్యలో ఇరుక్కుపోయిన చిన్నారి కాలు

స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న  ఓ బాలుడి కాలు డ్రైనేజీ గుంతలో ఇరక్కుపోయింది.  ఈ ఘటన  ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుుకుంది.  ఎంత ప్రయత్నం చేసిన పిల్లావాడు ఆ గుంతలో నుంచి తన కాలును విడిపించుకోలేకపోయాడు. పిల్లవాడి బాధను చూసి చాలామంది అతనికి సహాయం చేసేందుకు ట్రై చేశారు.  

 

అయినప్పటికీ అందులో నుంచి అతని కాలును అందులో నుంచి తీయడం వారికి సవాలుగా మారింది.  సంఘటనా స్థలంలో జనం గుంపులు గుంపులుగా ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకుని తాపీ మేస్త్రీని పిలిపించారు. అతను  రాయిని జాగ్రత్తగా పగలగోట్టి అతని కాలును విడిపించాడు.  

దాదాపు అరగంట పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడి పాదాన్ని డ్రైనేజీ గుంత నుంచి విజయవంతంగా బయటకు తీశారు.  వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  లక్నోలోని  అనేక రహదారులు ఇలాంటి  స్థితులోనే ఉండటతో జనాలు  ఆందోళన చెందుతున్నారు.