
- ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్
- ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
పద్మారావునగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చిలకలగూడ డివిజన్ పరిధిలో పోలీసులు సీతాఫల్‌మండి, వారాసిగూడ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రూల్స్ వ్యతిరేకిస్తే ఎవరైనా శిక్షార్హులు అవుతారని ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్‌దత్ హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు, నాయకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఫ్లాగ్ మార్చ్‌లో అడిషనల్ డీసీపీ కె.పృథ్వీధర్ రావు, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మట్టం రాజు, పి.శంకర్, సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు రెండు ప్లాటూన్ల ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది 54 మంది పాల్గొన్నారు.