హెచ్ఎం దీక్ష ఫలించింది..  బ‌‌‌‌డికి బాట దొరికింది

హెచ్ఎం దీక్ష ఫలించింది..  బ‌‌‌‌డికి బాట దొరికింది

పద్మారావునగర్, వెలుగు: హెడ్మాస్టర్ దీక్షతో చిల‌‌‌‌క‌‌‌‌ల‌‌‌‌గూడ దూద్​బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠ‌‌‌‌శాలకు బాట దొరికింది. సోమ‌‌‌‌వారం సికింద్రాబాద్​జీహెచ్ఎంసీ నార్త్ జోన్​కార్యాల‌‌‌‌యం ఎదుట స్కూల్ హెచ్ఎం మ‌‌‌‌ల్లికార్జున్ రెడ్డి ‘సీఎం గారు... మా బ‌‌‌‌డికి బాట వేయించండి’ అంటూ ప్లకార్డుతో ధ‌‌‌‌ర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్  ఏవీ రంగ‌‌‌‌నాథ్ ఆదేశాల‌‌‌‌తో ఇన్‌‌‌‌ స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో ప‌‌‌‌రిశీలించారు. పాఠ‌‌‌‌శాల‌‌‌‌కు వెళ్లే మార్గంలో అక్కడి నివాసితులు అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొల‌‌‌‌గించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీ‌‌‌‌నివాస్‌‌‌‌రావుతో పాటు సిబ్బంది కూడా ఉండి గోడ తొల‌‌‌‌గింపు ప‌‌‌‌నుల‌‌‌‌ను ప‌‌‌‌ర్యవేక్షించారు. గోడ తొల‌‌‌‌గించిన చోట గేటు ఏర్పాటు చేస్తామ‌‌‌‌ని జోన‌‌‌‌ల్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ర‌‌‌‌వి కిర‌‌‌‌ణ్‌‌‌‌ తెలిపారు. --