
మానవపాడు, వెలుగు: అధిక వానలు, తెగుళ్లతో దిగుబడి రాకపోవడంతో మిర్చి పంటను రైతులు దున్నుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మూలపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సూర్య రైతు నారాయణరెడ్డి మంగళవారం తన మిర్చి తోటను ట్రాక్టర్ తో దున్నాడు.
14 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి వేశానని, ఎకరాకు దాదాపు రూ.60 వేలు పెట్టుబడి పెట్టినట్టు, ఎక్కువ వానలు పడడంతో పంటకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిపోయిందని రైతు వాపోయాడు. ట్రాక్టర్ తో పంటను దున్నాల్సిన పరిస్థితి వచ్చిందని, తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.