
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని అక్టోబర్ 28వ తేదీ శనివారం రోజు మూసివేయనున్నారు. ఎనిమిది గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు ప్రకటించారు.
అక్టోబర్29వ తేదీన తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 8 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
తిరిగి అక్టోబర్29వ తేదీన ఆలయాన్ని శుభ్రం చేసి తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు. ఉదయం 7 నుంచి భక్తులను అనుమతించనున్నారు.
ఇటు తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయనున్నారు.