
హైదరాబాద్, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ కె.వీరరాఘవ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరపు అడ్వకేట్ సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.
కొందరి ప్రోత్సాహంతో చిలు కూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన 24 గంటల తరువాత ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు చేయడంలో జాప్యానికి ఎలాంటి కారణాలను పేర్కొనలే దని తెలిపారు.
ఆధ్యాత్మిక రంగంలో తన పిటిషనర్‌కు వస్తున్న పేరుప్రతిష్టలను ఓర్వలేకనే కొందరు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.