చైనాలో భారీ వరదలు: బాంబులు పెట్టి డ్యామ్ కూల్చివేత

చైనాలో భారీ వరదలు: బాంబులు పెట్టి డ్యామ్ కూల్చివేత

చైనాలోని అనేక ప్రాంతాలను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊర్లకు ఊర్లను ముంచెత్తి అల్లకల్లోలం చేసింది. వాగులు, వంకలు మొదలు నదుల వరకూ అన్ని ఉప్పొంగాయి. దీంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాదకర స్థాయి చేరింది. సెంట్రల్ చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో చుహే నదిపై న్న డ్యామ్‌లో వరద నీరు నిండిపోయి ఎగువన ముంపు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ వరదల దాటికి జనావాసాల్లోకి నీరు చేరి లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో నష్టాన్ని తగ్గించేందుకు డ్యామ్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయిపోయారు అధికారులు. ఇక ప్రజల ప్రాణాలను నిలబెట్టేందుకు మరో మార్గం లేక ఆదివారం ఉదయం డ్యామ్‌ను బాంబులు పెట్టి కూల్చేశారు. ఈ విషయాన్ని చైనాలోని సీసీ టీవీ వెల్లడించింది. సెంట్రల్ చైనాతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వరదలతో ఇప్పటి వరకు 18 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్లు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది.