చైనా కరెంట్ సంక్షోభం: మేఘాలను షూట్​చేసి వర్షాలు కురిపిస్తం

చైనా కరెంట్ సంక్షోభం: మేఘాలను షూట్​చేసి వర్షాలు కురిపిస్తం

బీజింగ్: కరువుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న చైనాను విద్యుత్​ సంక్షోభం కూడా వెంటాడుతోంది. కరువు, వేడిగాలులు తీవ్రంగా ఉన్న  నైరుతి చైనాలోని సిచువాన్​ ప్రావిన్స్​లో ఫ్యాక్టరీలకు గించారు. ఎలక్ట్రిసిటీ డిమాండ్​ను తగ్గించడానికి చాంగ్​కింగ్​ సిటీలో కొన్ని షాపింగ్​ మాల్స్​ను రోజులో ఎక్కువ సమయం మూసేస్తున్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి  9 గంటల వరకే మాల్స్​ తెరిచేందుకు అనుమతిస్తున్నారు. అలాగే ఆ ప్రావిన్స్​లోని 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వేడి వల్ల పలు ప్రాంతాల్లో గత వారం మంటలు చెలరేగాయి. కరువు వల్ల ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. నదుల్లో నీరు అడుగంటుతోంది. యాంగ్జీ నదిలో నీరు ఎండిపోతుండడంతో సరుకు రవాణా స్తంభించిపోయింది. హైడ్రోఎలక్ట్రిసిటీ డ్యామ్​ల నుంచి పవర్​ సప్లైను తగ్గించేశారు. కరెంట్​ కోతలతో ఉక్కపోతను ఎదుర్కోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మేఘాలను షూట్​చేసి వర్షాలు కురిపిస్తం

వ్యవసాయంపైనా కరెంటు కోతల ప్రభావం తీవ్రంగా ఉంది. పంటలను కాపాడుకునేందుకు మేఘాల్లో కెమికల్స్​ను షూట్​ చేసి వర్షాలు కురిపించేందుకు గవర్నమెంట్​ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రస్తుతం చైనాలో ఆకురాలే సీజన్​ ఉంది. ఆ దేశ మొత్తం వ్యవసాయ ఆదాయంలో ఈ సీజన్​లో వచ్చే ఆదాయం 75%. కరెంట్​ సంక్షోభం అధికార కమ్యూనిస్టు పార్టీని ఊపిరి తీసుకోనివ్వడంలేదు. బలహీనపడుతున్న ఆర్థిక వృద్ధిని గట్టెక్కించేందుకు షీ జిన్​పింగ్​ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జిన్​యాంగ్, గువాంగ్​సిటీల్లోని తన యూనిట్లలో ఈ నెల 25 వరకు విద్యుత్​ కోతలను పొడిగిస్తామని షెంజ్​హెన్​సిటీలోని లియర్​ కెమికల్​ కంపెనీ తెలిపింది. ప్రాసెసర్​ చిప్స్, సోలార్​ ప్యానెల్స్, ఆటో కంపోనెంట్లు, ఇండస్ట్రీలకు అవసరమయ్యే వస్తువులు తయారుచేసే సిచువాన్​ ప్రావిన్స్​లోని ఫ్యాక్టరీలు గత వారం కూడా మూతపడ్డాయి. మరికొన్ని కంపెనీల్లో దీర్ఘకాలం పాటు కరెంటు కోతలు విధించారు. ఇండ్లలో ఏసీల వాడకం బాగా పెరిగిందని, ఏసీల డిమాండ్​ను తీర్చడానికి ఫ్యాక్టరీలకు విద్యుత్​ కోతలు విధించామని అధికారులు తెలిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 

హైడ్రో ఎలక్ట్రిక్​ డ్యామ్​ల కరెంటు పైనా కోత..

9.4 కోట్ల జనాభా ఉన్న సిచువాన్ ప్రావిన్స్​కు 80% కరెంటు హైడ్రో ఎలక్ట్రిక్ ​డ్యామ్​ల నుంచే సప్లై అవుతుంది. చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో సిచువాన్​ ప్రావిన్స్​ వాటా 4%. అయితే బొగ్గుపై ఆధారపడిన ఇతర ప్రావిన్స్​లపై అంతగా ప్రభావంలేదని అధికారులు చెప్పారు. గత 61 ఏళ్లలో ఈ సమ్మర్​ దేశంలోనే అత్యంత వేడి, పొడి అయినదని సర్కారు తెలిపింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని ఆఫీసర్లు చెప్పారు.