
న్యూఢిల్లీ: చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పరిస్థితిని తీవ్రతరం చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తూర్పు లడాఖ్‌లో దాదాపు 40వేల మంది సైనికులు అధునాతన ఆయుధాలతో మోహరించినట్లు తెలుస్తోంది. ఆర్మీ, ప్రభుత్వంతో జరిగిన మీటింగ్‌లో జరిగిన అగ్రిమెంట్‌ను చైనా పాటించడం లేదని ఒక అధికారి చెప్పారు. “ పరిస్థితులను తీవ్రతరం చేసే సంకేతాలను ఇస్తూనే ఉన్నారు. డిఫెన్స్ సిస్టమ్, ఆయుధాలతో ఉన్న 40వేల మంది ట్రూప్స్‌ను మోహరించారు” అని ఒక ఆర్మీ అధికారి చెప్పారు. లాస్ట్ రౌండ్ చర్చలు జరిగిన తర్వాత కూడా పొజిషన్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదని అన్నారు. ఫింగర్ 5 ఏరియా నుంచి వెళ్లేందుకు చైనా అయిష్టతో ఉందని, ఫింగర్ ప్రాంతంలో ఒక పరిశీలన పోస్ట్‌ను సృష్టించుకోవాలనుకుంటునట్లు తెలుస్తోంది. అదే విధంగా వారు తూర్పు లడాఖ్‌లోని రెండు ప్రధాన ఘర్షణ కేంద్రాలు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేశారు. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పాంతంలో చైనా తమ సరిహద్దు వైపున ఉన్న వారి శాశ్వత ప్రదేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత భారతదేశం వ్యూహాత్మక ఎత్తులను ఆక్రమించగలదని ఒక సాకు చూపించి ఈ విధంగా చెస్తుందని వర్గాలు చెప్పారు.