చైనా సైబర్ అటాక్స్ కు భయపడం

V6 Velugu Posted on Apr 08, 2021

న్యూఢిల్లీ: టెక్నాలజీలో భారత్ కంటే చైనా ముందుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ అన్నారు. అయితే డ్రాగన్ కంట్రీని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చైనా నుంచి సైబర్ అటాక్స్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే సైబర్ దాడుల నుంచి రక్షణకు అవసరమైన వనరులను, సాంకేతికతను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాల్లో భాగంగా ఉండేలా సైబర్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. చైనా సైబర్ అటాక్స్ కు దిగినా భయమేం లేదని, దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

Tagged India-China, cds bipin rawat

More News