పాక్ వెనుక చైనా.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం

పాక్ వెనుక చైనా.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం

పాక్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాక్, చైనీస్ డిఫెన్స్ సిస్టం ఫెయిల్ అయ్యిందని, దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అడ్డుకున్నామని త్రివిధ దళాధిపతుల సమావేశంలో అన్నారు. పాక్ టెర్రిరస్టులను అంతం చేయాల్సింది పోయి.. ఉగ్రవాదులను కాపాడేందుకు పాక్ ప్రయత్నించడం చూస్తే జాలేస్తుందని . పాక్ కు జరిగిన నష్టానికి వాళ్లే కారణమని.. టెర్రిస్టులను కాపాడాలనుకుని మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. సోమవారం (మ 12) భారత త్రివిధ దళాధిపతుల ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై భారతDGMO వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులు చెప్పిన వివరాలు:

  •  భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
  •  కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాం
  • సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఆపరేషన్ సిందూర్ చేశాం
  • కానీ పాక్ సామాన్యులపై దాడి చేసింది.
  • పాక్ ఆర్మీ దాడుల్లో బార్డర్ లో అమాయకులు చనిపోయారు
  • ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను హతమార్చారు టెర్రరిస్టులు
  • భారత్ టెర్రిరిస్టులను మాత్రమే టార్గెట్
  • ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే భారత లక్ష్యం
  • పాక్ లోని ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేశాం
  • టెర్రరిస్టులకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది
  • ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదంపై పోరాడుతుంది
  • త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉంది
  • ప్రతీకారం శత్రువులు ఊహించని స్థాయిలో ఉండాలని ప్రధాని చెప్పారు.. అందుకే పాక్ కు బుద్ధి చెప్పాం
  • పాక్ వివిధ రకాల డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడి చేసింది.
  • పాక్ పంపిన మిస్సైళ్లను ఆకాశ్ క్షిపణితో వాటిని అడ్డుకున్నాం  
  • టెర్రిరస్టుల కోసం పాకిస్తాన్ కలుగజేసుకోవడం చూస్తే జాలేస్తుంది
  • ఇండియాపై దాడికి చైనా బాంబులను వినియోగించింది పాక్.. 
  • చైనా తయారు చేసిన PL-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది.
  • వాటిని దేశీయంగా తయారు చేసిన సిస్టమ్ తోనే వాటిని కూల్చేశాం
  • పీఓకే, పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంపులను దాడి చేశాం
  • భారత ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలిచింది
  • భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యం
  • అత్యాధునిక రాడార్ లతో నిఘా వ్యవస్థ
  • ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా ఉన్నాయి
  • ఎగిరరేవేంటో నిశితంగా గుర్తించే సామర్థ్యం ఉంది
  • నౌకాదళం కూడా పూర్తి సన్నద్ధంగా ఉంది
  • బీఎస్ఎఫ్ జవాన్లు వారి బాధ్యతను నిర్వర్తించారు
  • మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలించింది..