మార్స్ పైకి చైనా రోవర్..అమెరికా తర్వాత రెండో దేశం

మార్స్ పైకి చైనా రోవర్..అమెరికా తర్వాత రెండో దేశం


బీజింగ్: అంగారక గ్రహం (మార్స్)పై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు చేసిన ప్రయోగాల్లో మరో దేశం ముందడుగేసింది. చైనా విజయవంతంగా మార్స్‌‌‌‌పై తన ల్యాండర్, రోవర్‌‌‌‌‌‌‌‌ను దించింది. గత ఏడాది జులై 23నలో ప్రయోగించిన తియాన్‌‌‌‌వెన్–1 స్పేస్‌‌‌‌క్రాప్ట్ ఆరు నెలల పాటు 32 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరిలో మార్స్ ఆర్బిట్‌‌‌‌కు చేరుకుంది. అప్పటి నుంచి కక్ష్యలో ఉన్న తియాన్‌‌‌‌వెన్–1 ఆర్బిటర్‌‌‌‌‌‌‌‌ నుంచి శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ల్యాండింగ్ మాడ్యూల్ వేరుపడి శనివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు మార్స్‌‌‌‌ వాతావరణంలోకి ఎంటర్ అయింది. తొమ్మిది నిమిషాల టెర్రర్ తర్వాత నెమ్మదిగా ఆ మాడ్యూల్ స్పీడ్‌‌‌‌ తగ్గించుకుంటూ ఉదయం 7:18 గంటలకు మార్స్‌‌‌‌పై సదరన్ ఏరియాలో ల్యాండ్ అయిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. మరో 17 నిమిషాల్లో రోవర్‌‌‌‌‌‌‌‌ తన సోలార్ ప్యానెల్స్, యాంటినా ఓపెన్‌‌‌‌ చేసుకుని సిగ్నల్స్ పంపిందని తెలిపింది. 240 కిలోల బరువైన ఈ రోవర్‌‌‌‌‌‌‌‌కు చైనా అగ్ని దేవుడు ‘ఝురోంగ్’ పేరు పెట్టారు. దీనికి హై రెజల్యూషన్ టోపోగ్రఫీ కెమెరాతో పాటు ఆరు సైంటిఫిక్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్ ఫిట్ చేసి ఉన్నాయి. ఇది మార్స్‌‌‌‌పై మొదటగా ల్యాండ్‌‌‌‌ అయిన చోట మట్టిని, వాతావరణాన్ని పరిశీలిస్తుంది. ఆ గ్రహంపై గతంలో జీవం ఉండిందా? నీళ్లు, మంచు ఉండే అవకాశాలున్నాయా? అనే వాటిని ఇది స్టడీ చేస్తుంది. ఈ మిషన్‌‌‌‌ లైఫ్ టైమ్ కేవలం 3 నెలలు మాత్రమే. ఈ ప్రయోగంలో పాల్గొన్న సైంటిస్టులకు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అంతరిక్ష పరిశోధనల్లో చైనాను ముందంజలో నిలిపారని అన్నారు. 

1976లో తొలిసారి అమెరికా సక్సెస్

మార్స్‌‌‌‌పైకి రోవర్‌‌‌‌‌‌‌‌ను దించిన రెండో దేశంగా చైనా నిలిచింది. అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా 1976 జులైలో తొలిసారి వికింగ్–1 అనే మిషన్‌‌‌‌ ద్వారా మార్స్‌‌‌‌పై తన ల్యాండర్, రోవర్‌‌‌‌‌‌‌‌లను విజయవంతంగా దించింది. అయితే అదే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సోవియట్ యూనియన్ మార్స్‌‌‌‌పై తన మిషన్‌‌‌‌ను ల్యాండ్ చేసినప్పటికీ దానితో కొన్ని సెకన్లలోనే కమ్యూనికేషన్ ఫెయిల్ అయిపోయింది. గతంలో రష్యాతో కలిసి చైనా కూడా ఒక ప్రయోగం చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేదు.