
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న స్పై డ్రామా ‘చైనా పీస్’. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి.
ఇదొక స్పై ఫిల్మే కాదు.. ఇందులో కామెడీ కూడా ఉంది. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని కోరుకుంటున్నా’ అని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఎమోషన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని నిహాల్, సూర్య శ్రీనివాస్ అన్నారు. డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ‘ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్’ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. అన్ని విభాగాల్లో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని చెప్పాడు. నటులు కమల్ కామరాజు, దీక్ష పంత్, హర్షిత కార్యక్రమంలో పాల్గొన్నారు.