చైనా పీపీఈ కిట్స్ నాసిరకం… క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్

చైనా పీపీఈ కిట్స్ నాసిరకం… క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్

న్యూఢిల్లీ : చైనా వస్తువులంటేనే క్వాలిటీ ఎలా ఉంటుందో తెలిసిందే. నో గ్యారంటీ, నో వారంటీ. కనీసం కరోనాను ఎదుర్కొనేందుకు తయారు చేస్తున్న పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ), టెస్టింగ్ కిట్స్ విషయంలోనైనా డ్రాగన్ కంపెనీలు బుద్ది మార్చుకోవటం లేదు. కిట్స్, పీపీఈ లను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. తాజాగా చైనా నుంచి ఇండియా కు వచ్చిన 1, 70, 000 (పీపీఈ) ల్లో 50, 000 పనికి రావని తేలింది. మనదేశం సీఈ/ఎఫ్ డీఏ అప్రూ చేసిన పీపీఈ లనే వాడుతోంది. చైనా నుంచి వచ్చిన వాటికి సీఈ/ఎఫ్ డీఏ అఫ్రూవ్ లేదు. దీంతో గ్వాలియర్ లోని డీఆర్డీఓ లో ల్యాబ్ లో పీపీఈ కిట్ల స్టాండర్డ్స్ ను టెస్ట్ చేశారు. క్వాలిటీ టెస్ట్ లో 50 కిట్స్ నాసిరకమేనని తేలినట్లు ల్యాబ్ అధికారులు తెలిపారు. చైనా నుంచి వచ్చిన కిట్స్ అన్నింటిని పలు బడా కంపెనీలు గవర్న మెంట్ కు డొనేట్ చేసివనే. దేశంలో పీపీఈలు, ఎన్ 95 మాస్క్ ల కొరత ఉంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చైనా ఎక్కువగా పీపీఈ కిట్స్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో డ్రాగన్ మినహా ప్రపంచ దేశాలకు దిగుమతి చేసేకునేందుకు వేరే మార్గం లేకుండా పోయింది. చైనా డొనేట్ చేసిన టెస్టింగ్ కిట్స్, పీపీఈ లలో కూడా చాలా వరకు క్వాలిటీ లేవని ఇప్పటికే పలు యూరోప్ దేశాలు ఆరోపించాయి. దేశంలో పీపీఈ ల కొరత తీర్చేందుకు 10 లక్షల కిట్లకు సింగపూర్ సహా పలు కంపెనీలకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది.