సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, లక్నో తదితర సిటీల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. హైదరాబాద్ లోనూ ప్రొటెస్ట్ కు ప్లాన్ చేసింది. ఆదివారం (జూన్ 13) ఇందిరాపార్కు దగ్గర ఆందోళన నిర్వహించనుంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర చేపట్టనున్న ఆందోళనకు పోలీసుల అనమతి లభించింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకుకుకాక్రోచ్ పార్టీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ధర్నా కు అనుమతి కోరుతూ పోలీస్ లకు వినతి పత్రం ఇవ్వగా.. పోలీసులు అనుమతి ఇచ్చారు. ధర్నా లో 200 మంది యువత పాల్గొననున్నారు. అయితే గత ఆందోళనలను గమనిస్తే.. ఇందిరా పార్క్ నిరసనలకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
