చైనాలో విజృంభిస్తున్న కరోనా

చైనాలో విజృంభిస్తున్న కరోనా

చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 16 వేల 412 కొత్త కేసులొచ్చినట్లు ప్రకటించింది చైనా ప్రభుత్వం. కరోనా మొదలైన తర్వాత వచ్చిన కేసుల్లో ఇవే అత్యధికం. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. 27 ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించింది చైనా ప్రభుత్వం. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారే ఎక్కువగా ఉన్నారంది. లాక్ డౌన్ విధించినా.. ఈ ప్రాంతాల్లో కేసు నమోదు కావడంతో మరింత కఠిన ఆంక్షలు విధించాలని చూస్తున్నారు అధికారులు. షాంఘైలో రెండో దశ లాక్ డౌన్ మార్చి 28 నుంచి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో 26 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యింది చైనా ప్రభుత్వం. దీంతో లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. కొత్త కేసుల్లో... లక్షణాలు లేని వారే అధికంగా ఉన్నారని తెలిపారు చైనా అధికారులు.

మరిన్ని వార్తల  కోసం

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

మాట నిలబెట్టుకున్న రాజమౌళి