యూఎన్ హెచ్చార్సీ ఓటింగ్ లో ఇండియా గైర్హాజరుపై చైనా సైలెంట్

యూఎన్ హెచ్చార్సీ ఓటింగ్ లో ఇండియా గైర్హాజరుపై చైనా సైలెంట్

బీజింగ్: చైనాలోని జిన్​జియాంగ్​లో మానవ హక్కుల పరిస్థితిపై యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్​లో నిర్వహించిన ఓటింగ్​కు భారత్ దూరంగా ఉండడంపై చైనా సైలెంట్​గా ఉంది. అయితే వీగర్​ ముస్లింలపై తాను అనుసరిస్తున్న విధానాన్ని చైనా సమర్థించుకుంది. టెర్రరిజం, వేర్పాటువాదాన్ని అడ్డుకునేందుకే వీగర్​ ముస్లింల విషయంలో కఠినంగా ఉండాల్సి వస్తోందని పేర్కొంది.

జిన్​జియాంగ్ లో ప్రజల హక్కులను కాపాడాలని, ప్రజలను గౌరవించాలని ఇండియా పిలుపునిచ్చిన తర్వాత చైనా ఆవిధంగా స్పందించింది. శనివారం మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడారు. జిన్​జియాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని తెలిపారు.