163 రోజుల్లో 40 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన తియాన్ వెన్-1
బీజింగ్: అంగారక గ్రహంపైకి చైనా పంపిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ‘తియాన్ వెన్–1’ వేగంగా దూసుకుపోతోంది. వచ్చే నెలలో తమ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ ఆర్బిట్ లోకి ఎంటరయ్యే అవకాశం ఉందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) వెల్లడించింది. ఆదివారం నాటికి తమ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ లో163 రోజులు పూర్తి చేసుకుందని, మొత్తం 40 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపింది. ప్రస్తుతం భూమికి 13 కోట్ల కిలోమీటర్ల దూరంలో.. మార్స్ కు 83 లక్షల కిలోమీటర్ల చేరువలో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే నెలలో స్పేస్ క్రాఫ్ట్ మార్స్ ఆర్బిట్ లోకి చేరే అవకాశాలున్నాయని తెలిపింది. అంగారక గ్రహానికి చైనా చేపట్టిన ఫస్ట్ మిషన్ ఇదే. తియాన్ వెన్ ను జులై 23, 2020న లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా చైనా ప్రయోగించింది.
