జులై అలర్ట్ : చైనాలో వరుస ప్రకృతి విధ్వంసాలు

జులై అలర్ట్ : చైనాలో వరుస ప్రకృతి విధ్వంసాలు

చైనాలో  కురుస్తున్న ఎడ తెరిపి వర్షాల కారణంగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  దీంతో వేలాది మంది ప్రజలు ఖాళీచేసి సహాయకశిబిరాలకు వెళ్లారు.  ఈ క్రమంలో దాదాపు జులై నెల మొత్తం భిన్నమైన వాతావరణం నెలకొంటుందని .. దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని చైనా వాతావరణ శాఖ తెలిపింది. 

జులై నెలలో చైనా  అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కోనుంది.   నైరుతి చైనాలోని వరద ప్రభావిత  ప్రాంతాలను -ప్రేరేపిత చైనా విపత్తుల  సంస్థ   అప్రమత్తం చేసింది.  కొన్ని ప్రాంతాల్లో  రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. వరదలు , తీవ్ర తుపాన్లు, టైఫూన్లు, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉందని చైనా వాతావరణ శాఖ తెలిపింది.  వాయువ్య చైనాలోని షాన్‌షి ప్రావిన్సులో గడిచిన 50ఏళ్లలో ఇంతటి  భారీ వర్షాలు పడలేదని అధికారులు చెబుతున్నారు. 

నైరుతి మెట్రోపాలిస్ చాంగ్‌కింగ్ శివార్లలోని  రైల్వే వంతెన  కూలిపోయింది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు 400 మంది అత్యవసర సిబ్బంది సర్వే చేస్తున్నారు.  చైనాలో  కురుస్తున్న ఎడ తెరిపి వర్షాల కారణంగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  దీంతో వేలాది మంది ప్రజలు ఖాళీచేసి సహాయకశిబిరాలకు వెళ్లారు.  ఈ క్రమంలో దాదాపు జులై నెల మొత్తం భిన్నమైన వాతావరణం నెలకొంటుందని .. దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని చైనా వాతావరణ శాఖ తెలిపింది.  దీంతో అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి.

సిచువాన్ ప్రావిన్స్‌లో,  భారీ వర్షం కారణంగా 4 లక్షల 60 వేల మంది ప్రభావిత మయ్యారని  జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.  ఇక్కడ  వర్షం కారణంగా దాదాపు 85 వేల మంది ప్రజలు తమ ఇళ్ల ఖాళీచేశారు. . మరోవైపు సెంట్రల్‌ హునాన్‌ ప్రావిన్సులోనూ భారీ వరదల కారణంగా వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ దాదాపు 2వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లోని అపార్టుమెంట్‌లు, దుకాణాలు వరద నీటిలో మునిగిపోయిన వీడియోలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. 
ఇలా ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే.. మరోవైపు అనేక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని బీజింగ్‌లో గత ఆరు దశాబ్దాల్లో లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. జూన్‌లో ఏకంగా వరుసగా 14 రోజులు వడగాల్పులు వీయడం అత్యంత అరుదని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బీజింగ్‌ పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి శిలాజ ఇంధన వినియోగమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆసియా దేశాల్లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా తొలిస్థానంలో ఉంది.  2030 నాటికి అత్యధికంగా కర్బన ఉద్గారాలను పెంచాలని, 30 ఏళ్ల తర్వాత కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని చైనా  లక్ష్యంగా పెట్టుకుంది.