ఉజ్బెకిస్తాన్​ టూర్​ తర్వాత తొలిసారి బయటకు

ఉజ్బెకిస్తాన్​ టూర్​ తర్వాత తొలిసారి బయటకు

బీజింగ్: చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్ మంగళవారం బీజింగ్​లోని ఓ ఎగ్జిబిషన్​ను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని స్టేట్​ టెలివిజన్​ ప్రసారం చేసింది. ఉజ్బెకిస్తాన్​ పర్యటన తర్వాత తొలిసారి గా ఆయన జనంలోకి వచ్చారు. దీంతో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, జిన్​పింగ్​ను హౌస్​ అరెస్టు చేశారని జరుగుతున్న ప్రచారానికి పుల్​స్టాప్​ పడింది. జిన్​పింగ్​ పాలనపై దేశంలో వ్యతిరేకత పెరుగుతున్నా తన స్థానాన్ని కొనసాగించుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. కరోనా కంట్రోల్​కు తీసుకున్న చర్యలతో ప్రెసిడెంట్​పై జనం ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు తైవాన్​తో ఉద్రిక్తత లపై పలు దేశాలు చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చే నెల 16న జరగబోయే చైనీస్​ కమ్యూని స్టు పార్టీ మీటింగ్​లో మూడోసారి కూడా పదవిలో కొనసాగించేందుకు జిన్​పింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.