చించోలి ... అందాల రంగోళి

చించోలి ... అందాల రంగోళి
  • చించోలి అందాల రంగోళి
  • పర్యాటకులను ఆకట్టుకుంటున్న వైల్డ్​లైఫ్​ శాంక్చురీ


దారి పొడవునా పచ్చదనం. కొండలు, గుట్టల మధ్య పెద్ద పెద్ద చెట్లు. పక్షుల కిలకిలరావాలు, పరుగులు తీసే జింకలు... వీటన్నింటినీ ఒకే చోట చూడాలంటే చించోలి వైల్డ్​లైఫ్​ శాంక్చురీకు వెళ్లాలి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉంది ఈ వైల్డ్​ లైఫ్​ శాంక్చురీ. పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే ఈ ప్లేస్​ వీకెండ్ టూర్​కి బాగుంటుంది. ఇక్కడికి వెళ్తే గొట్టంగుట్ట వాటర్​ఫాల్​ అందాల్ని కూడా 
చూసి రావొచ్చు. 

కర్ణాటకలోని కలబుర్గి జిల్లా, తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాల మధ్య ఉంది ఈ వైల్డ్​లైఫ్​ శాంక్చురీ. చించోలి అటవీ ప్రాంతాన్ని 2011లో  వైల్డ్​లైఫ్​ శాంక్చురీగా డిక్లేర్​ చేశారు. 134 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే మొదటి ‘డ్రై ల్యాండ్​ వైల్డ్​లైఫ్​ శాంక్చురీ’గా చించోలికి పేరు.. ఇక్కడ తుమ్మ, టేకు చెట్లతో పాటు రకరకాల మెడిసినల్​ ప్లాంట్స్​ ఎక్కువ కనిపిస్తాయి. గంధం, ఎర్రచందనం చెట్లు కూడా అక్కడక్కడా ఉంటాయి.  పచ్చని చెట్ల మధ్య తిరుగుతూ, పక్షుల పలకరింపుల్ని వింటూ ట్రెక్కింగ్​ చేయడం, శాంక్చురీ చూడడం థ్రిల్లింగ్​గా అనిపిస్తుంది. 

 

  • ఇవి స్పెషల్​ అట్రాక్షన్స్​


ఈ వైల్డ్​లైఫ్​ శాంక్చురీలో తోడేళ్లు, హైనాలు స్పెషల్​ అట్రాక్షన్​.  కృష్ణజింక, నాలుగు కొమ్ముల దుప్పి, గబ్బిలం​ వంటివి కూడా కనిపిస్తాయి.  నీలం రంగు పావురాలు, రంగురంగుల రామచిలకలతో పాటు దాదాపు  35 రకాల పక్షుల్ని చూడొచ్చు. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు జర్నీ చేస్తే చంద్రంపల్లి డ్యాం వస్తుంది. భీమ నది మీద కట్టిన ఈ డాంకి దగ్గర్లో నాలుగు చిన్న డ్యాంలు ఉంటాయి. అక్కడే రాత్రి బస చేయాలనుకునేవాళ్లు కర్ణాటక టూరిజం ఏర్పాటు చేసిన కాటేజీల్లో ఉండొచ్చు. ‘తెలంగాణ ఊటీ’ గొట్టంగుట్ట  కూడా చించోలికి దగ్గరే. దాంతో టూరిస్టులు అక్కడికి వెళ్లి, వాటర్​ఫాల్స్​ అందాల్ని చూస్తూ, ఫొటోలు దిగుతూ ఎంజాయ్​ చేస్తారు. వీకెండ్​లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి చాలామంది  ఈ ప్లేస్​కి వెళ్తుంటారు.  జూలై– అక్టోబర్​ నెలల మధ్య ఇక్కడికి వెళ్తే బాగుంటుంది.  

 

  • ఇలా వెళ్లాలి..


జహీరాబాద్​ నుంచి 32 కిలోమీటర్లు జర్నీ చేస్తే చించోలి వైల్డ్​లైఫ్​ శాంక్చురీ వస్తుంది.   వికారాబాద్​ నుంచి కూడా వె