బార్డర్ నుంచి బంకర్లు ఖాళీ చేసిన చైనా ఆర్మీ

బార్డర్ నుంచి బంకర్లు ఖాళీ చేసిన చైనా ఆర్మీ

చైనా ఆర్మీ వాపస్‌

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) నుంచి ఇండియా, చైనా తమ బలగాలను వెనక్కి పిలిపించుకునే ప్రాసెస్ కొనసాగుతోంది. పాంగాంగ్ సో లేక్ ఒడ్డు నుంచి  చైనా బలగాలు టెంట్లను తొలగించి, బంకర్లను ఖాళీ చేసి, మూటెముల్ల సర్దుకుని ట్రక్కుల కోసం వెయిట్ చేస్తున్న వీడియోలు, ఫొటోలను ఇండియన్ ఆర్మీ మంగళవారం రిలీజ్ చేసింది. దాదాపు ఏడాదిపాటు టెన్షన్ పరిస్థితులు నెలకొన్న ఈస్టర్న్ లడఖ్ బార్డర్ నుంచి రెండు దేశాలకు చెందిన ఆర్మీ ట్యాంకులు కూడా వెనుదిరిగాయి. బలగాలను ఉపసంహరించుకునేందుకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ లాస్ట్ వీక్ ప్రకటించారు. అప్పట్నుంటే బలగాల ఉపసంహరణ స్టార్ట్ అయ్యింది. కొండ ప్రాంతాల నుంచి కిందికి దిగుతూ ట్రక్కుల కోసం చైనా జవాన్లు వెయిట్ చేస్తున్నట్టు వీడియోలు, ఫొటోల్లో ఉంది. అయితే ఫింగర్ 8కి దగ్గరలోని పాంగాంగ్ సో లేక్ నార్త్ ఒడ్డున చైనా బలగాలు కొనసాగనున్నాయి. మన బలగాలు ఫింగర్ 3కి సమీపంలోని పర్మినెంట్ బేస్ అయిన ధన్ సింగ్ థాపా పోస్ట్ లో పహారా కొనసాగించనున్నాయి. నో మ్యాన్స్ ల్యాండ్​లో పెట్రోలింగ్ చేయబోమని రెండు దేశాలు అంగీకరించాయి. బలగాలు వాపస్​ వచ్చిన 48 గంటల్లో మిలటరీ కమాండర్ల స్థాయిలో మీటింగ్ జరుగుతుందనిరాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

For More News..

22.. 50.. వయసు ఎంతైనా అందరికీ ఒకే న్యాయం

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మహిళపై రేప్​