
బీజింగ్: చైనాకు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగి తొలగింపునకు చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాంగ్ అనే వ్యక్తిని 2015లో ఓ కంపెనీ తొలగించింది. రోజుకు ఆరు గంటలు సదరు ఉద్యోగి టాయిలెట్లోనే గడుపుతున్నట్టుగా తెలిపింది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించి తాను మలద్వారం సమస్యతో బాధ పడ్డానని దానిని పరిగణలోకి తీసుకుని తన ఉద్యోగం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరాడు.
కానీ, న్యాయస్థానం సంస్థ నిర్ణయాన్నే సమర్థించింది. నెట్టింట ఈ వార్తపై జోకులు పేలుతున్నాయి. కోర్టు గనుక అతడకి అనుకూలంగా తీర్పు ఇచ్చుంటే ఉద్యోగులంతా ఈ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునేవారంటూ కామెంట్లు చేస్తున్నారు.