మా టీకాల కెపాసిటీ అంతంతే.. పవర్ పెంచుతం

మా టీకాల కెపాసిటీ అంతంతే.. పవర్ పెంచుతం

బీజింగ్:కరోనా నివారణకు చైనా కంపెనీలు తయారు చేసిన టీకాల పనితీరు అంతంతేనని స్వయంగా చైనీస్ ఉన్నతాధికారే ఒకరు వెల్లడించారు. చైనీస్ ప్రభుత్వ కంపెనీలైన సినోవాక్, సినోఫార్మ్ తయారు చేసిన రెండు టీకాలతో వైరస్ నుంచి పెద్దగా ప్రొటెక్షన్ లభించే చాన్స్ లేదని చైనా సెంటర్​ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) డైరెక్టర్ గావో ఫూ స్పష్టం చేశారు. శనివారం చెంగ్డూ సిటీలో జరిగిన ఓ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రెండు టీకాలను కలిపి ఒకే టీకాగా మార్చి.. ఎఫికసీ (పనితనం)ని పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే ట్రెడిషనల్ పద్ధతికి బదులు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో కొత్త టీకాలను తయారు చేయాలా? అన్నదానిపైనా దృష్టి పెట్టామని తెలిపారు. ఏదైనా వ్యాక్సిన్ కనీసం 50% ఎఫికసీతో పని చేస్తేనే దానిని ఉపయోగించేందుకు అనుమతి ఇస్తారు. సినోవాక్ టీకా ఎఫికసీ 50.4 శాతం మాత్రమేనని బ్రెజిల్ రీసెర్చర్లు తేల్చారు. అమెరికన్ కంపెనీ ఫైజర్ తయారు చేసిన బయోఎన్ టెక్ టీకా 97% ఎఫికసీతో పని చేస్తుందని తేలింది. అయితే గావో ఫూ కామెంట్స్ పై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆల్రెడీ రీసెర్చ్ మొదలైందని, దేశంలో అభివృద్ధి చేసిన కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయని సీడీసీకి చెందిన మరో అధికారి చెప్పారు. 

మిక్స్ చేస్తే పవర్ పెరుగుతది 

రెండు టీకాలను మిక్స్ చేయడం వల్ల.. కెపాసిటీ గణనీయంగా పెరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్ బయోఎన్ టెక్, స్వీడిష్​ కంపెనీ ఆస్ట్రాజెనికా టీకాలను కలిపి మరింత పవర్ ఫుల్ టీకాను తయారు చేసేందుకు కూడా బ్రిటన్ సైంటిస్టులు రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఇక చైనా వ్యాక్సిన్ లు ఇప్పటికే మెక్సికో, టర్కీ, ఇండోనేసియా, హంగరీ, బ్రెజిల్ సహా 22 దేశాలకు సప్లై అయ్యాయి. ఈ నెల 2 నాటికే చైనాలో 3.40 కోట్ల మందికి ఈ టీకాలతో రెండు డోస్ లు వేశారు. 6.50 కోట్ల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు. అయితే ఫస్ట్ డోస్ కు, రెండో డోస్ కు మధ్య 14 రోజుల కంటే ఎక్కువ గడువు ఇచ్చి ఉంటే ఎఫికసీ పెరిగేదని చైనా అధికారులు అంటున్నారు.