సెకనుకు 150 సిన్మాలు ట్రాన్స్ ఫర్ .. చైనాలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్  

సెకనుకు 150 సిన్మాలు ట్రాన్స్ ఫర్ .. చైనాలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్  

బీజింగ్:  ప్రపంచంలోనే అతి వేగవంతమైన ఇంటర్నెట్ నెట్ వర్క్ ను తాము రూపొందించామని చైనీస్ సైంటిస్టులు ప్రకటించారు. బీజింగ్, వుహాన్, గ్వాంగ్జౌ సిటీలను కలుపుతూ 3 వేల కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తో నిర్మించిన ఈ నెట్ వర్క్ ద్వారా సెకనుకు 1.2 టెరాబిట్స్ (1,200 గిగాబిట్స్) స్పీడ్​తో డేటాను పంపుకోవచ్చని వారు వెల్లడించారు. సింపుల్​గా చెప్పాలంటే.. ఒక్కో సెకనుకు 150 హెడ్ డీ మూవీస్​ను ఈ ఇంటర్నెట్ నెట్ వర్క్ తో ట్రాన్స్​ఫర్ చేయొచ్చని తెలిపారు.

సింఘ్వా యూనివర్సిటీ, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంస్థలు కలిసి ఈ నెట్ వర్క్ ను రూపొందించాయని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఓ కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఇంటర్నెట్ నెట్ వర్క్ లు100 జీబీపీఎస్ స్పీడ్ తో మాత్రమే పని చేయగలుగుతున్నాయని హువావే టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ పేర్కొన్నారు. అమెరికా ఇటీవలే పూర్తి చేసిన 5జీ ఇంటర్నెట్2 నెట్ వర్క్ ద్వారా సైతం గరిష్టంగా 400 జీబీపీఎస్ వేగంతో మాత్రమే డేటాను పంపుకునేందుకు వీలవుతుందని తెలిపారు. గత జులైలోనే ఈ నెట్ వర్క్​ను యాక్టివేట్ చేశామని, సోమవారం అధికారికంగా ప్రారంభించామన్నారు. ఈ నెట్ వర్క్​ను సూపర్ ఫాస్ట్ ట్రైన్​ ట్రాక్​ల నిర్వహణకు వినియోగించనున్నామని వివరించారు.