లాక్ డౌన్ ఎత్తేశారు..టూర్లకు ఎగబడుతున్న జనం

లాక్ డౌన్ ఎత్తేశారు..టూర్లకు ఎగబడుతున్న జనం

బీజింగ్: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచా న్ని కమ్మే సింది. అనేక దేశాల్లో రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నది. చైనాలో ప్రస్తుతా నికి తగ్గిపోవడంతో స గ్గి ర్కారు లాక్ డౌన్ ఎత్తేసింది. దీంతో నెలల తరబడి ఇండ్ల కే పరిమితమైన జనం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నా రు. టూరిస్ట్ ప్లేస్ లకు పోటెత్తుతున్నారు. వైరస్ ముప్పు తప్పి కొద్దిరోజులు కూడా కాకముందే ఇలా గుంపులు గుంపులుగా జనం టూరిస్ట్ప్లేసెస్ కు వెల్లువెత్తు తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ముప్పు ఇంకా తప్పిపోలేదని, ఇలా చేస్తే పెద్దఎత్తున రిస్క్ తప్పదని హెచ్చరిస్తున్నా రు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు సోమవారం 13,23,641కు చేరాయి. 73,608 మంది చని పోయారు. 2.77 లక్షల మంది కోలుకున్నారు.

పోటెత్తుతున్నరు..

శనివారం అన్హుయి ప్రావిన్స్ లోని హాంగ్సాన్ మౌంటైన్ పార్కుకు 20 వేల మంది రావడం, అందరూ గుంపులు గుంపులుగా తిరగడం వంటివి మీడియాలో వైరల్ అయ్యాయి. షాంఘైలోని బండ్ వాటర్ ఫ్రంట్ వద్దా ఇదే పరిస్థితి కనిపించిం ది. బీజింగ్ లోని పార్కులకూ జనం పోటెత్తారు.

స్పెయిన్ లో మరణాలు తగ్గినయ్

స్పెయిన్ లో వరుసగా నాలుగో రోజు కొవిడ్ మరణాలు తగ్గాయి. సోమవారం నాటికి 24 గంటల్లో మృతుల సంఖ్య 637కు పరిమితమైం ది. గత 13 రోజుల్లో ఇది తక్కువని అధికారులు తెలిపారు. కొత్తకేసులు 3.3 శాతం తగ్గాయి.

ఇటలీలో చావులను దాస్తున్నరు..

ఇటలీలో డాక్టర్లు, సిబ్బంది లేక చాలా మందికి హా స్పిటల్ సౌకర్యమే అందడం లేదని, దీంతో చాలా మంది ఇంటివద్దే కరోనాతో చనిపోతున్నా రని లోకల్ మీడియా వెల్లడించిం ది. ఆదివారం నాటికి 15,887 మంది చనిపోయినట్లు అధికారులు వె ల్లడిం చారని, కానీ వాస్తవానికి మరణాల సంఖ్య రెట్టింపు ఉండొచ్చని తెలిపింది.

ఆర్థిక సంక్షోభం దిశగా ఫ్రాన్స్

కరోనా వల్ల ఫ్రాన్స్ ఆర్థిక ర్థి వ్యవస్థరెండో ప్రపంచ యుద్ ధం తర్వాత అంతటి స్థాయిలో సంక్షోభంలో పడిపోనుందని ఆ దేశ ఆర్థిక ర్థి మంత్రి బ్రూనో లీ మైర్ చెప్పారు. ఫ్రాన్స్ లో 1945 తర్వాత 2009లో ఎకానమీ గ్రోత్ రేట్ మైనస్ 2.2గా నమోదైందని, ఇప్పుడు కరోనా వల్ల మళ్ ఆ లీ స్థాయిలో ఆర్థిక ర్థి మాంద్యం కమ్ముకొస్తోందని మంత్రి అన్నా రు.

సింగపూర్ లో 20 వేల ఫారినర్లు క్వారంటైన్

సింగపూర్ లో 20 వేల మంది ఫారిన్ వర్కర్లను క్వారంటైన్ చేసింది. కొవిడ్ కేసుల్లో ఫారిన్ వర్కర్లే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం రెండు డా ర్మిటరీలను ఐసోలేషన్ ఏరియాలుగా మార్చింది. రెండు డార్మిటరీల్లో ఇప్పటిదాకా 90 మందికి వైరస్ కన్ఫమ్ అయింది. దేశంలో మంగళవారం నుంచి లాక్ డౌన్ కూడా అమలు చేయనున్నారు.

నిలకడగా బోరిస్ జాన్సన్ హెల్త్

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడ గానే ఉందని ఆ దేశ హౌజింగ్ మినిస్ట ర్ రాబర్ట్ జెన్రిక్ వెల్లడిం చారు. ముందు జాగ్రత్తగానే ఆయన హాస్పిటళ్లో చేరారని, త్వరలోనే తిరిగివస్తారన్నారు. తాను బాగానే ఉన్నా నని జాన్సన్ వెల్లడించారు. తనకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు, సిబ్బందికి థ్యాంక్స్ చెప్పారు. యూకేలో ఆదివారం నాటికి 24 గంటల్లో 621 మంది కొవిడ్ వల్ల చనిపోయారని, మొత్తంగా 48 వేల కేసులు నమోదు కాగా, 4,934 మంది మరణించారని అధికారులు చెప్పారు.

వివిధ దేశాల్లో ఇదీ పరిస్థితి..

ఈక్వెడార్ లోని గుయాకిల్ సిటీలో శవపేటిక లకు కొరత ఏర్పడింది. శవాలను ఉంచేందుకు బాక్సులను వాడుతున్నా రు. స్థానిక కంపెనీలు 1000 కార్ బోర్ డ్ డ్బాక్సులను డొనేట్ చేశాయి. జపాన్ ప్రభుత్వం మంగళవారం నుంచి ఎమర్జె న్సీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. స్వీడన్ లో కరోనా విపత్తును సర్కారు సీరియస్ గా తీసుకోవడం లేదన్న విమర్శల నేపథ్యం లో.. లాక్ డౌన్ ను పాటించకుంటే వేల మంది చావడం ఖాయం అంటూ ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోవెన్ ప్రజలను హెచ్చరించారు. పెరూలో విధించిన లాక్ డౌన్ వల్లపేదలు ఆకలితో అలమటిస్తున్నారు.