ఇప్పుడున్న డిజిటల్ టెక్ వరల్డ్ లో గూగుల్ లేకుండా పని జరిగే పరిస్థితి లేదు. బింగ్, యాహూ వంటి సెర్చ్ ఇంజిన్లు ఎన్ని ఉన్న ఎక్కువగా ఉపయోగించేది గూగులే. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆగిపోతే ఇంకేమైనా ఉంటుందా. 2026 మే 12వ తేదీన అదే జరిగింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ సర్వర్ డౌన్ అవ్వటం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. సెర్చ్ ఇంజిన్ పనిచేయక పోవడంతో.. యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు.
చాలా మంది యూజర్లు గూగుల్ సెర్చ్ వినియోగిస్తున్న క్రమంలో.. వి ఆర్ సారీ.. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది.. మా ఇంజినీర్లు ప్రాబ్లం రిజాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో సారి ట్రై చేయండి.. అనే మెసేజ్ డిస్ ప్లే అయ్యిందట. దీంతో గూగుల్ సర్వర్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు.
ఎక్కువగా ఇండియా నుంచి కంప్లైంట్స్ వెళ్లాయి. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్.. అనే మెసేజ్ వచ్చిందని.. గూగుల్ పనిచేయటం లేదని .. సోషల్ మీడియాలో చాలా మంది అప్ డేట్ చేశారు. సాధారణంగా బ్యాకెండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా యూజర్ బ్రౌజర్‌కు, కంపెనీ సర్వర్‌లకు మధ్య కమ్యూనికేషన్‌కు గ్యాప్ వచ్చినపుడు ఈ అంతరాయం వస్తుందని టెక్నీషియన్స్ తెలిపారు. ఈ టైమ్ లో తాము అడపాదడపా సెర్చ్‌లు చేయలేకపోయామని లేదా ఫలితాలను యాక్సెస్ చేయలేకపోయామని యూజర్లు తెలిపారు. అయితే ఆ తర్వాత కాసేపటికే మళ్లీ ఇష్యూ రిజాల్స్ అవ్వటంతో ఊపిరిపీల్చుకున్నారు.
