‘చింగారీ’ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్

V6 Velugu Posted on Apr 02, 2021

దేశీయ వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీకి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అంతే కాదు ఆ సంస్థలో ఓ వాటాదారుగా సల్మాన్ బోర్డులోనూ చేరారు. సల్మాన్‌ చేరికపై చింగారీ సహవ్యవస్థాపకులు, సీఈఓ సుమిత్‌ ఘోష్‌ హర్షం వ్యక్తం చేశారు. చింగారీ భారత్‌లోని ప్రతి మూలకు చేరేందుకు సల్మాన్ భాగస్వామ్యం తోడ్పతుందని తెలిపారు. 

చింగారీ సంస్థ తన వినియోగదారులకు కొత్త అనుభూతి ఇస్తుందని హామీ ఇచ్చారు సల్మాన్ ఖాన్. అతి తక్కువ సమయంలో చింగారీకి లభించిన ఆదరణ తనను ఆకట్టుకుందన్నారు. సిటీల నుంచి గ్రామాల వరకు లక్షల మంది ప్రతిభను బయటకు తీసుకువచ్చేలా చింగారీ యాప్ కృషి చేస్తోందన్నారు సల్మాన్.

Tagged Brand Ambassador, chingari, salman khan

Latest Videos

Subscribe Now

More News