సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి శ్రీ రామానుజాచార్యులు

సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి శ్రీ రామానుజాచార్యులు

హైదరాబాద్: సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి రామానుజాచార్యులని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని, సాంఘిక విప్లవాన్ని సమాజానికి అందించిన మహనీయుడని కొనియాడారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలను ఫిబ్రవరి 2నుంచి 14 వరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెయ్యేండ్ల పండగ సందర్భంగా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుతో పాటు 216 అడుగుల రాజానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. స్ఫూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులోకి తేనున్నారు.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వైరస్ అసమానత అని, ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నాడని చిన్నజీయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే మతానికి చెందిన వ్యక్తులు కూడా పరస్పరం కలిసుండే వాతావరణాన్ని చూడలేకపోతున్నామని అన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు మానవ సమాజంలో వ్యాపించిన వైరస్ ను తొలగించేందుకు 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నట్లు చిన్నజీయర్ ప్రకటించారు. ఇందుకోసం లక్షన్నర కిలోల నెయ్యి ఉపయోగించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విచారణ స్పీడప్