108  దివ్యదేశాల్లోని ఆలయాల్లో శాంతి కళ్యాణం వాయిదా

108  దివ్యదేశాల్లోని ఆలయాల్లో శాంతి కళ్యాణం వాయిదా

ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఇవాళ ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహాపూర్ణాహుతితో 12 రోజుల యజ్ఞం విజయవంతమైంది. ఈనెల 3న మొదలైన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు 12 రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. 

అయితే ఇవాళ రాత్రి  108  దివ్యదేశాల్లోని ఆలయాల్లో జరుగాల్సిన  శాంతి కళ్యాణం వాయిదా వేశామని తెలిపారు చిన్న జీయర్ స్వామి. ఈ నెల 19 న 108 ఆలయాల్లో శాంతి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. యాగశాలలో హోమాలు నిర్వహించిన రుత్వికులను  చిన్న జీయర్ స్వామి ఈ సందర్భంగా సన్మానించారు. ప్రవచన మండపంలో రుత్వికులు, భక్తులతో  చిన్నజీయర్ స్వామి సమావేశమయ్యారు. చరిత్రలో 108 ఆలయాల్లో మొదటి సారి ఈ నెల 19 వ తేదీన  కళ్యాణం నిర్వహిస్తామన్నారు.  వైభవంగా శాంతి కళ్యాణం జరపాలని నిర్ణయించామని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి: 

రాహుల్ పర్యటన ఉందని నా హెలికాప్టర్ నిలిపివేశారు

సీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్