రాహుల్ పర్యటన ఉందని నా హెలికాప్టర్ నిలిపివేశారు

రాహుల్ పర్యటన ఉందని నా హెలికాప్టర్ నిలిపివేశారు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో జరిగిన మొదటి బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ నిర్వహించారు. మేము ప్రపంచ మార్కెట్ కంటే తక్కువ ధరకు పురుగుమందులు,ఎరువులు అందించామన్నారు. మా ప్రభుత్వం సహజ మరియు సేంద్రీయ వ్యవసాయంపై పని చేస్తుందన్నారు. 23 లక్షల మంది పంజాబ్ రైతులు ఖాతాల్లో నేరుగా పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై దర్యాప్తు చేయడానికి మేము సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే కాంగ్రెస్  మాత్రం ఎల్లప్పుడూ నిందితులకు పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చిందని విమర్శించారు ప్రధాని మోదీ. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు ప్రధాని. దేశ సురక్షత కోసం పనిచేసే ప్రభుత్వం పంజాబ్‌కు కావాలన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పంజాబ్ కోసం పనిచేయలేదన్నారు. ఎవరైనా పనిచేద్దాం అనుకున్నా వారి ముందు వెయ్యి సమస్యలు తీసుకొస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రిమోట్ కంట్రోల్‌తో నడుస్తాయన్నారు. ఢిల్లీలో ఓ కుటుంబం వారిని నడిపిస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్‌ పార్టీ తొలగించిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో పంజాబ్ వస్తున్న తన హెలికాఫ్టర్‌ను  కాంగ్రెస్ వాళ్లు..నిలిపివేశారన్నారు. పంజాబ్‌లో  'యువరాజ్' (రాహుల్ గాంధీ) విజిట్ ఉన్నందున తన హెలికాఫ్టర్‌నను ఆపేసారిన మోడీ విమర్శించారు. 

 

ఇవి కూడా  చదవండి:

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే