సీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్

సీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్

విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అరిగిపోయిన రికార్డులాగా మళ్లీ మళ్లీ అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టనవసరంలేదని విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులోని మూడో పేజీలో క్లియర్ గా రాశారని అర్వింద్ అన్నారు. జెన్ కో, ట్రాన్స్ కో ఆస్తులను తాకట్టుపెట్టి ముఖ్యమంత్రి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీలు ఆపమని ఎక్కడా కేంద్రం చెప్పలేదని అర్వింద్ స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలు అడిగి కేసీఆర్ సైన్యాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

బాలీవుడ్ హిట్ నెంబర్కు స్టెప్పులేసిన సంజయ్, మాధురీ

‘రాధేశ్యామ్’ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది