చిరాగ్​ పాశ్వాన్ కు 100 శాతం స్ట్రైక్ రేట్..

చిరాగ్​ పాశ్వాన్ కు  100 శాతం స్ట్రైక్ రేట్..

న్యూఢిల్లీ :  లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్​లోని హజీపూర్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి చిరాగ్ విజయం సాధించారు. కేంద్ర మంత్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకైన చిరాగ్ పాశ్వాన్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు సినీ నటుడిగా ఉన్నారు. 2020లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే తండ్రి రాం విలాస్ పాశ్వాన్‌ చనిపోయారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కలిసి పోటీ చేయడం ఇష్టం లేక.. ఒంటరిగా బరిలోకి దిగారు. నితీశ్ కుమార్‌కు గట్టి పోటీ ఇచ్చారు. 

అనేక ఆటు పోట్లను తట్టుకుని నిలబడ్డారు. అంతకుముందు, 2014లో జముయీ లోక్​సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019లో అదే సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఎన్విరాన్​మెంట్, హిందీ అడ్వైజరీ, ఎకనామిక్ ఎఫైర్స్ వంటి పలు కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. చివరకు 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మోదీతో జత కట్టారు. బీహార్‌లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ ఎల్జేపీ ఎంపీలను గెలిపించుకున్నారు. లోక్‌జన శక్తి పార్టీ తరఫున ఐదుగురు లోక్​సభ సభ్యులను మోదీకి గిఫ్ట్​గా ఇచ్చారు.