ఇండియాలో ఆయన ఒక్కరే మెగాస్టార్

ఇండియాలో ఆయన ఒక్కరే మెగాస్టార్

ఇది చ‌‌రిత్ర మ‌‌ర‌‌చిపోయిన వీరుడు ఉయ్యాల‌‌వాడ న‌‌ర‌‌సింహారెడ్డి క‌‌థ‌‌ అని.. ఇలాంటి వీరుడి క‌‌థ‌‌ను మ‌‌న దేశంలోని ప్రజలు తెలుసుకోవాల్సిన అవ‌‌స‌‌రం ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ముంబైలో సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి‘ ఒకటిన్నర దశాబ్దంగా సినిమా వాయిదా ప‌‌డుతూనే వ‌‌స్తోంది. అందుకు కార‌‌ణం బ‌‌డ్జెట్ ప‌‌రిమితులే. సురేంద‌‌ర్ రెడ్డి, చ‌‌రణ్ ఈ సినిమా చేయ‌‌డానికి ముందుకు రావ‌‌డంతో నా క‌‌ల నెర‌‌వేరింది. అమితాబ్‌‌గారు నా రియ‌‌ల్ లైఫ్ మెంట‌‌ర్‌‌. నాకు తెలిసినంత వ‌‌ర‌‌కు ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్‌‌గారే. ఆయ‌‌న దగ్గరకు కూడా ఎవ‌‌రూ రీచ్ కాలేరు. ఆయ‌‌న‌‌తో క‌‌లిసి ప‌‌ని చేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్రకి ఆయనైతేనే బాగుంటుందని డైరెక్టర్ సురేంద‌‌ర్ రెడ్డి అన్నారు. ఎందుకంటే అదొక‌‌ స్పెష‌‌ల్ పాత్ర. అందుకే నేను ప్రయత్నిస్తానని చెప్పి బచ్చన్‌‌గారికి ఫోన్ చేశాను. విషయం చెప్పి, ఓ వారం రోజులు కాల్షీట్స్ ఇస్తే చాలని అడిగాను. వెంటనే అంగీకరించారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను 2007లో రాజ‌‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. మళ్లీ 2016లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ కాలంలో సినిమాల్లో చాలా మార్పులు వ‌‌చ్చాయి. నా నూట యాభయ్యో సినిమా యాభయ్యో సినిమా చేసేటప్పుడు నాకు అంతా కొత్తగా అనిపించింది. అయితే సినిమాలో కంటెంట్‌ , ఎమోష న్స్‌‌లో మాత్రం మార్పు లేదు‘ అని అన్నారు.