
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, గత కొద్ది రోజులుగా కేరళలో మూడో షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు.
చిరంజీవి, నయనతార జంటపై ఓ పాటతో పాటు కీలకమైన సీన్స్‌ను చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయింది. దీంతో చిరంజీవితో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్‌లో హైదరాబాద్ చేరుకున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’..ముచ్చటగా మూడవ షెడ్యూల్‌ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు.. అంటూ హైదరాబాద్ రీచ్ అయిన వీడియోను అనిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘మన శంకరవరప్రసాద్ గారు’అని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇదే ఈ సినిమా టైటిల్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ సినిమా. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
“మన శంకరవరప్రసాద్ గారు” ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు✨#ChiruAnil
— Anil Ravipudi (@AnilRavipudi) July 23, 2025
Megastar @KChiruTweets garu, #Nayanthara #Bheemsceciroleo @sahugarapati7 @sushkonidela #Archana@YoursSKrishna @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/VEcKj9FYMb