Sasirekha Song Promo: అనిల్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సాంగ్ ఫిక్స్.. క్రేజీగా చిరు-నయన్ ‘శశిరేఖ’ ప్రోమో

Sasirekha Song Promo: అనిల్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సాంగ్ ఫిక్స్.. క్రేజీగా చిరు-నయన్ ‘శశిరేఖ’ ప్రోమో

మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ జంటగా నటిస్తున్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్‌‌లైన్‌‌.    అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో "శంకరవరప్రసాద్" పాత్రలో చిరు నటిస్తుండగా, "శశిరేఖ" పాత్రలో నయనతార నటిస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరి కలయికలో రూపొందించిన సాంగ్ అప్డేట్ వచ్చింది.

లేటెస్ట్గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి రెండో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ‘శశిరేఖ’ (Sasirekha) అంటూ సాగే ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మెలోడియస్ ట్యూన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ‘‘శశిరేఖ.. ఓ మాట చెప్పాలి.. చెప్పాక.. ఫీలు కాక’’.. ‘‘ఓ ప్రసాద్.. మొహమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమి కాదు..’’ అంటూ అనంత శ్రీరామ్ క్రేజీ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రోమో చూస్తుంటే.. మరో బ్లాక్ బస్టర్ సాంగ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పూర్తి పాటను డిసెంబర్ 8న చూడాల్సిందే!!

ఇప్పటికీ ఈ సాంగ్ కి సంబంధించిన చిరంజీవి ఎనర్జిటిక్‌‌ డ్యాన్స్‌‌ మూమెంట్స్‌‌ పోస్టర్స్ రిలీజ్ అయ్యి హైలెట్ అయ్యాయి. అలాగే, స్టైలిష్‌‌ డ్యాన్స్‌‌ పోజ్‌‌లో నయనతార సైతం ఇంప్రెస్ చేస్తోంది. ఇకపోతే, "శంకరవరప్రసాద్" నుంచి ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సాంగ్‌‌ 75 మిలియన్ల+వ్యూస్‌‌ను సాధించి చార్ట్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘శశిరేఖ’ వంతు!!

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్‌‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.