చిరంజీవి హీరోగా ఆయన 158వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేయగా, ఆదివారం ఓ క్రేజీ అప్‌డేట్‌ను అందించారు మెగాస్టార్. ఈనెల 21న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు చిరంజీవి స్వయంగా ఒక పవర్‌ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.
ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు హింట్ ఇస్తోంది.
‘గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21న ముహూర్తం.. కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిది.. అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ’ అని చిరంజీవి వీడియోలో చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. చిరంజీవి, బాబీ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.
కుర్ర హీరోలకు పోటీగా..
బాబీ సినిమాతో పాటు, చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనిని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండటం విశేషం. ఇది కాకుండా, సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస ప్రాజెక్టులతో మెగాస్టార్ దూసుకుపోతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 సంక్రాంతి లక్ష్యంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
Dear Annayya,
— Bobby (@dirbobby) May 17, 2026
Every time I see you train with this intensity and passion, it reminds me why you continue to inspire generations 🙏🏻
The fire, discipline and hunger in you are simply unmatched. It’s pushing me to dream bigger and work harder for #Mega158 🤗
Beyond excited to… https://t.co/hrUr2JTRki
చిరు సరసన ప్రియమణి..
యశ్ 'టాక్సిక్', విజయ్ 'జన నాయకన్' వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటించబోతుండగా, యువ నటి ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు
An absolute honor to collaborate once again with our beloved Megastar @KChiruTweets garu 🙏
— Bobby (@dirbobby) August 22, 2025
Excited to create another memorable cinematic journey together 🔥
With the passionate team of @KvnProductions & @LohithNK01, #MEGA158 is going to be truly special ❤️🔥 #ChiruBobby2 #ABC https://t.co/6Einw4xEko
