భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ : ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ : ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్' (Bhola Shankar). స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా తమన్నా నటించగా.. కీర్తీ సురేష్ చిరుకు చెల్లిగా కలిపించింది. అక్కినేని హీరో సుశాంత్ మరో కీ రోల్ లో కనిపించారు. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను.. చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశామని తెలిపారు దర్శకుడు మెహర్ రమేష్.

ప్రపంచ వ్యాప్తంగా భోళా శంకర్ ఈ రోజు(ఆగస్టు 11)న భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. ఆల్రెడీ అమెరికాతో పాటు మరికొన్ని లొకేషన్లలో షోలు పడ్డాయి. మరి భోళా శంకర్ సినిమాపై అక్కడి ఆడియన్స్ టాక్ ఎలా ఉంది? సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేవి ఈ రివ్యూలో తెలుసుకుందాం.

ఓవర్ ఆల్ గా భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ నుండి ఏవరేజ్ నుండి అబౌవ్ ఏవరేజ్ టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేస్తుండగా.. కామన్ ఆడియన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారని సమాచారం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేదని, కానీ మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక కీర్తీ సురేష్ (Keerthy Suresh)ను విలన్స్ నుండి తీసుకెళ్లే సీన్స్ లో చిరంజీవి ఇచ్చే మాస్ వార్నింగ్ అద్భుతమని చెప్తున్నారు. మరికొందరేమో.. వేదాళంను చెడగొట్టారని, రెండు యాక్షన్ సీన్లు, కామెడీ సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని నెటిజన్స్ ట్వీట్ చెప్తున్నారు. మరి భోళా శంకర్ పూర్తి రిజల్ట్ ఏంటి తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.