చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో ఇది 158వ చిత్రం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కీలకపాత్ర పోషిస్తోంది. మే మూడో వారంలో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు. తాజాగా పొలాచ్చిలో కొత్త షెడ్యూల్ మొదలైంది. చిరంజీవి ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఇదిలాఉంటే.. గురువారం ‘పెద్ది’ మూవీ రిలీజ్ సందర్భంగా మెగా 158 టీమ్ పొలాచ్చి నుంచి శుభాకాంక్షలు తెలియజేసింది. చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను షూటింగ్ కోసం పొలాచ్చిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ సినిమాపైనే ఉందని, గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టానికి సక్సెస్ రూపంలో ప్రతిఫలం దక్కిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
