
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో మరోసారి థియేటర్స్‌కు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి సినిమా ‘కొదమ సింహం’ రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో జానర్ పరంగా ప్రత్యేకమైన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నటించిన ఏకైక కౌబాయ్ సినిమా ఇది.
కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. 20 సెంటర్స్ ల్లో 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంది. ఇందులో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. సుడిగాలి అనే పాత్రలో మోహన్ బాబు కామెడీ విలన్‌గా నటించారు.
1990, ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముప్ఫై ఐదేళ్ల తర్వాత ఇప్పుడీ సినిమాను మరోసారి థియేటర్స్‌కు తీసుకొస్తున్నారు. 4 కె కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో నవంబర్ 21న రీ రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలియజేశారు.
1990 ముందు వరకు కౌబాయ్ పాత్రలంటే, హీరో సూపర్ స్టార్ కృష్ణ పోషించేవారు. ఈ కొదమ సింహంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు. ఆ తర్వాత ఈ తరహా పాత్రల్లో చాలా తక్కువమంది ట్రై చేశారు. బద్రి లో కేవలం ఒక పాటకి పవన్ కళ్యాణ్ కౌబాయ్ పాత్రని పోషించాడు. టక్కరి దొంగ లో హీరో మహేష్ బాబు పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు.