
ప్లాన్ చేంజ్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు చిరంజీవి. ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో చిరు 157వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, ఇప్పటికే అనుష్కను ఫైనల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. 17 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్టాలిన్’ చిత్రంలో అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో డాన్స్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకి వీరిద్దరూ జంటగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అలాగే వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ చిత్రం కంటే ముందు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం సెట్స్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే.. మల్లిడి వశిష్ట తెరకెక్కించే చిత్రం సోషియో ఫాంటసీ జానర్ కావడంతో.. షూటింగ్ తర్వాత గ్రాఫిక్స్ వర్క్‌కు ఎక్కువ టైమ్ పట్టనుంది. దీంతో ముందుగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట మెగాస్టార్. 2025 సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పంచభూతల కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.