గద్దర్ అవార్డులను ముందుకు తీసుకెళ్దాం.. ఫిలిం ఛాంబర్​కు చిరంజీవి సూచన

గద్దర్ అవార్డులను ముందుకు తీసుకెళ్దాం.. ఫిలిం ఛాంబర్​కు చిరంజీవి సూచన
  • గద్దర్ అవార్డులను ముందుకు తీసుకెళ్దాం
  • ఫిలిం ఛాంబర్​కు చిరంజీవి సూచన

హైదరాబాద్, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికి సినీ ఇండస్ట్రీ నుంచి స్పందన లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మంగళవారం ఆయన ట్వీట్  చేశారు. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తామన్నారు. సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా'గద్దర్ అవార్డ్స్'  తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అభినందనీయమని చిరంజీవి ట్వీట్​ చేశారు.