పీవీకి భారతరత్న.. తెలుగువారికి గర్వకారణం: చిరంజీవి

పీవీకి భారతరత్న.. తెలుగువారికి గర్వకారణం: చిరంజీవి

తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుతం భారతరత్న ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవలు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ స్థితిగతులను మార్చిన తీరును గుర్తుచేసుకుంటూ ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).   

నిజమైన దార్శనికుడు,  బహుభాషావేత్త, పండితుడు, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు భారతరత్న రావడం మనందరికీ గర్వకారణం. ఆయన చేసిన విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశ స్థితి గతులను మార్చివేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి కారణం ఆయన.ఆ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరికి, అందులోనూ తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం.. అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.