తొలిప్రేమ గురించి చెప్పిన మెగాస్టార్

తొలిప్రేమ గురించి చెప్పిన మెగాస్టార్

అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగులో మెగస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అమీర్ ఖాన్, చిరంజీవితో పాటు మూవీలో బాలరాజు పాత్రలో నటించిన అక్కినేని నాగ చైతన్య ఓ టీవీ ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోలో వారి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. 

లాల్ సింగ్ చడ్డా మూవీలో హీరో పదేళ్ల వయసులో ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని నాగార్జున ప్రస్తావించగానే అమీర్ ఖాన్ వెంటనే మీరు సార్ మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు అని చిరును అడిగాడు. ఆ మాట వినగానే చిరంజీవి నవ్వుతూ గుర్తు తెచ్చుకోనివ్వండంటూ ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను అని చెప్పారు. మొగల్తూరులో ఒకమ్మాయి సైకిల్ తొక్కుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేదని అన్నారు. ఆ అమ్మాయి సైకిల్ ఎలా తొక్కుతుందో వెనక్కి తిరిగి చూసేవాడనని, అప్పుడా అమ్మాయి ముందు చూడు అని తన ముఖాన్ని ముందుకు తిప్పేదని చిరంజీవి గుర్తు చేసుకున్నాడు.