- అశ్లీల వీడియోలు చేసి పోర్న్సైట్లలో పెట్టిన సైబర్ క్రిమినల్స్
- సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మెగాస్టార్చిరంజీవి డీప్ఫేక్బారిన పడ్డారు. కొందరు సైబర్క్రిమినల్స్డీప్ఫేక్సహాయంతో ఆయన అశ్లీల చిత్రాల్లో నటించినట్టు వీడియోలు క్రియేట్చేసి పలు వెబ్సైట్లలో పోస్ట్‌చేశారు. ఇది గత నెల జరగ్గా ఆయన తన పేరు, రూపం ఉపయోగించి డీప్‌ఫేక్ సాయంతో కొందరు అశ్లీల వీడియోలు తయారు చేసి పోర్న్ సైట్లలో పోస్ట్చేస్తున్నారని, వాటిని తొలగించాలని సిటీ సివిల్కోర్టును సెప్టెంబరులో ఆశ్రయించారు. దీంతో కోర్టు అదే నెల 26న ఆయా వెబ్సైట్లలో కంటెంట్తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, రెండ్రోజుల కింద డీప్ఫేక్వీడియోలు క్రియేట్చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని సైబర్క్రైమ్పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
‘ఓ మహిళతో తాను లైంగిక చర్యల్లో పాల్గొన్నట్టు వీడియోలు సృష్టించి కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్‌చేశారు. అవి పూర్తిగా ఏఐ డీప్‌ఫేక్ ద్వారా తయారు చేసినవి. ఈ వీడియోలు నా గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న మంచిపేరును చెడగొడుతున్నాయి. సదరు వెబ్సైట్లు ఒకదానికొకటి కంటెంట్‌ను షేర్‌చేసుకుంటూ రీపోస్ట్ చేస్తున్నాయి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
